BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

Select Suryaa Now
మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహర్నవమి సందర్భంగా విజయవాడ సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కార్యాలయంలో సోమవారం సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి. రాజశేఖరబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని పోలీసు ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏడాది మహర్నవమి రోజున నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో కీలకమైన ఆయుధాలు, వాహనాలకు పూజలు చేసి పోలీసు శాఖ సంప్రదాయాలను కొనసాగించారు. దసరా శరన్నవరాత్రుల నేపథ్యంలో నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లు, వివిధ పోలీసు విభాగాల్లోనూ ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగం అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె. తిరుమలేశ్వరరెడ్డి, షిరిన్‌ బేగం, కె.జి.వి. సరిత, కృష్ణ ప్రసన్న, ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి, బి. సత్యనారాయణ, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ ఎన్‌.వి. రమణ, ఏఆర్‌ ఏసీపీలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.