BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి

Select Suryaa Now
విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి

విజయవాడ మేజర్ న్యూస్ : కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్ వేదికగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవ్‌లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి చేసింది. వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో చిత్ర టీజర్‌ను విడుదల చేయగా, సినీ ప్రముఖుల సందడి, అభిమానుల కేరింతలతో పున్నమి ఘాట్ ప్రాంగణం ఉత్సాహభరితంగా మారింది.  ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రముఖ సినీ నటుడు సత్యం రాజేష్, చిత్ర హీరో గగన్, యాంకర్ రవి, చిత్ర బృంద సభ్యులతో పాటు సెల్‌కాన్, మెయిల్ తదితర ప్రముఖ కంపెనీలు, సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.  ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ..  విజయవాడ ఉత్సవ్ 2.0 ద్వారా నగరంలోని కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, వినోద రంగాలకు విశేష ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కళాకారులు, పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఒకే వేదికపైకి రావడం విజయవాడ ఉత్సవ్ ప్రత్యేకత అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నగరానికి కొత్త గుర్తింపును తీసుకురావడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి ఊతమిస్తాయని అన్నారు. విజయవాడలోని సాంస్కృతిక వైభవాన్ని రాష్ట్రవ్యాప్తంగా చాటిచెప్పేందుకు విజయవాడ ఉత్సవ్ కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలందరూ ఉత్సవాల్లో భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.  సత్యం రాజేష్ మాట్లాడుతూ..  ‘క్యాస్ట్’ సినిమా విజయవాడ నేపథ్యంగా సాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలను గుర్తుచేసేలా ఈ చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. దర్శకుడు జంపన్న సహజత్వానికి ప్రాధాన్యమిస్తూ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. ప్రేక్షకులకు సినిమా నచ్చితే మరో పది మందికి ఈ చిత్రం గురించి చెప్పి ప్రోత్సహించాలని కోరారు. విజయవాడ ఉత్సవ్ వంటి పెద్ద వేదికపై సినిమా టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉందన్నారు.  చిత్ర హీరో గగన్ మాట్లాడుతూ..  తనకు విజయవాడతో విడదీయలేని అనుబంధం ఉందని తెలిపారు. తాను విజయవాడలో పుట్టి పెరిగానని, బావాజీపేటలో నివసించిన రోజులను గుర్తుచేసుకున్నారు. కొత్త సినిమా విడుదలైతే చూసేందుకు వెళ్లేవాడినని, తనలో సినిమాలపై ఆసక్తి బీజం పడింది విజయవాడలోనేనని చెప్పారు. మంచి థ్రిల్లింగ్ అంశాలతో సాగే ‘క్యాస్ట్’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నలుగురు హీరోలు ఉన్నారని, దర్శకుడు జంపన్న సినిమాను చక్కగా తెరకెక్కించారని పేర్కొన్నారు. విజయవాడ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తే రాష్ట్రవ్యాప్తంగా సినిమాకు విజయావకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు.  యాంకర్ రవి మాట్లాడుతూ.. విజయవాడలో ఇంతమంది ప్రేక్షకుల సమక్షంలో తమ సినిమా వేడుక జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విజయవాడ ప్రేక్షకుల్లో ఉండే ఉత్సాహం ప్రత్యేకమని, సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల తొలి స్పందన తెలుసుకోవడానికి ఈ నగరం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ‘క్యాస్ట్’ చిత్రంలో హాస్యం, కథ, థ్రిల్లర్ అంశాలు ఉంటాయని వివరించారు. ముఖ్యంగా మహిళలు ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరారు. విజయవాడ ఉత్సవ్ వేదికపై టీజర్ విడుదల కావడం తమ చిత్ర బృందానికి ప్రత్యేక అనుభూతినిచ్చిందని తెలిపారు. వివిధ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ..  విజయవాడ ఉత్సవ్ 2.0 నగర ప్రజలకు వినోదాన్ని అందించడంతో పాటు, కళాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సంస్థలు, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇటువంటి ఉత్సవాలు నగరంలో పర్యాటక రంగ అభివృద్ధికి, వ్యాపార కార్యకలాపాల విస్తరణకు, స్థానిక ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తాయని అభిప్రాయపడ్డారు. విజయవాడను సాంస్కృతిక, వినోద కేంద్రంగా మరింత అభివృద్ధి చేసే దిశగా విజయవాడ ఉత్సవ్ దోహదపడుతుందని తెలిపారు.  వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ‘క్యాస్ట్’ టీజర్ విడుదల కార్యక్రమం విజయవంతంగా సాగింది. విజయవాడ ఉత్సవ్ 2.0 వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సినీ రంగానికి సంబంధించిన వేడుకలు నిర్వహించడం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.