BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం

Select Suryaa Now
విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ..  - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం

విజయవాడ మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని కూటమి నేతలు నిర్ణయించారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతో పాటు అన్ని వార్డుల్లోనూ విజయాలు సాధించేందుకు 100 శాతం ఫలితాలే లక్ష్యంగా పనిచేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ చిన్ని తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో వంగవీటి రాధాకృష్ణ, బుద్ధా వెంకన్న, పట్టాభితో కలిసి ఎన్నికల వ్యూహం, వార్డుల వారీగా ప్రచార ప్రణాళిక, అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణ మేయర్ అభ్యర్థిగా బరిలోకి దిగడం కూటమి నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. వంగవీటి కుటుంబానికి విజయవాడ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని, రాధాకృష్ణ యువకుడని, మేయర్ పదవికి సరైన అభ్యర్థి అని పేర్కొన్నారు. ఆయన రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించేలా కూటమి శ్రేణులన్నీ సమష్టిగా కృషి చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నుంచి కూటమి నేతలంతా ప్రతి వార్డులో కలిసికట్టుగా పర్యటించి ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. వార్డుల వారీగా అభ్యర్థుల జాబితా సిద్ధమైందని, కూటమిలో రెబల్‌ అభ్యర్థుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. టికెట్లు ఆశించి అవకాశం దక్కని నాయకులతో చర్చించి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యాచరణపై నేతలతో చర్చించారు. విజయవాడ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ కూటమి శ్రేణులన్నీ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మేయర్ అభ్యర్థిగా తన విజయంతో పాటు అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. బుద్ధా వెంకన్న, పట్టాభి కూడా వార్డుల వారీగా ప్రచార ప్రణాళిక, నాయకులు, కార్యకర్తల సమన్వయం, టికెట్లు ఆశించిన వారిని కలుపుకొని ముందుకు వెళ్లే అంశాలపై చర్చించారు. కూటమి ఐక్యతను బలోపేతం చేస్తూ అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.