BREAKING
అసత్యంపై ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది: ద్వారక దసరా వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం! భారత విమానయాన రంగంలో రికార్డుల ప్రస్థానం: 2047 నాటికి 130 కోట్ల ప్రయాణికులే లక్ష్యం.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి! సంపద, విజ్ఞానం, శక్తి కలబోసిన భారత్‌గా తీర్చిదిద్దడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం: తజికిస్తాన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టీకరణ! కొద్ది వారాల్లోనే భారత్-అమెరికా చారిత్రక వాణిజ్య ఒప్పందం: యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన ప్రకటన! ఉగ్రవాదంపై మా భాగస్వామ్య దేశాలు జీరో టాలరెన్స్ చూపించాలి: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ.. తహవ్వుర్ రాణా అప్పగింతపై హర్షం! 'ఉడాన్' పథకానికి పదేళ్లు: దేశవ్యాప్తంగా 1.72 కోట్ల మందికి విమాన ప్రయాణం.. 687 రూట్లతో సామాన్యుడి సొంతమైన ఆకాశం! భారత్-న్యూజిలాండ్ చారిత్రక వాణిజ్య ఒప్పందం అమలు.. ఇరుదేశాల హర్షం! హరిహర క్షేత్రంలో ఘనంగా శమి పూజలు 2029 డిసెంబర్ 31 నాటికి పంజాబ్‌ను ‘నశా ముక్త్’గా మారుస్తాం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్! ఎన్నికలు రాగానే పంజాబ్ గుర్తొచ్చిందా?: అమిత్ షాపై భగవంత్ మాన్ ధ్వజం! కాలనేమి కూడా రాముడి నామాన్ని జపించేవాడు: అయోధ్యపై విపక్షాల దుష్ప్రచారంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర వ్యాఖ్యలు! మహారాష్ట్రలో ప్రభుత్వం మారాల్సిందే: దసరా ర్యాలీలో బీజేపీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ధ్వజం! అమెరికాలో 3 లక్షల వీసాల రద్దు.. నేరస్థులపై ఉక్కుపాదం! పాకిస్తాన్, సౌదీ అరేబియాతో చారిత్రక 'మక్కా రక్షణ ఒప్పందం': ధ్రువీకరణ కోసం పార్లమెంటుకు పంపిన టర్కీ ప్రభుత్వం! ఇంధన సంక్షోభంపై మాక్రాన్ వ్యూహం: గల్ఫ్ దేశాల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు

కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి

Select Suryaa Now
కుష్టు వ్యాధి అనుమానితుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలి

ధర్మసాగర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లాలో కుష్టు వ్యాధి అనుమానితులను ముందస్తుగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 22వ తేదీ గురువారం నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆలం అప్పయ్య తెలిపారు. సోమవారం ఉదయం ప్రాథమిక వైద్యానికి ఏదైనా సందర్శించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.   ఆయన కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించేందుకు రూపొందించిన ఫ్లాష్ కార్డును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ, అక్టోబర్ 22వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఆశా కార్యకర్తలు గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారని తెలిపారు. ఈ సర్వే ద్వారా కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించి, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.కుష్టు వ్యాధి అనేది మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది ప్రధానంగా చర్మం, పరిధీయ నరాలను ప్రభావితం చేస్తుంది. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైకల్యాలను నివారించవచ్చు.
కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించేందుకు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులను ఈ క్రింది లక్షణాల గురించి అడిగి తెలుసుకుంటారు. శరీరంపై పాలిపోయిన లేదా ఎర్రటి మచ్చలు ఉండటం,మచ్చ ఉన్న ప్రాంతంలో స్పర్శ జ్ఞానం తగ్గడం లేదా పూర్తిగా లేకపోవడం,చర్మంపై మచ్చలతో పాటు తిమ్మిరి లేదా మొద్దుబారిన భావన కలగడం, చేతులు, కాళ్లలో స్పర్శ జ్ఞానం తగ్గడం లేదా నరాలకు సంబంధించిన ఇతర లక్షణాలు కనిపించడం, చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు ఉండటం.ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారించలేమని, అర్హత కలిగిన వైద్య సిబ్బంది పరీక్షల ద్వారా మాత్రమే వ్యాధిని నిర్ధారించాలని వైద్యాధికారులు సూచించారు.
కుష్టు వ్యాధి ప్రారంభ దశలో గుర్తించి, వైద్యుల సూచనల మేరకు బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్ తెరఫీ – ఎం డి టి) పూర్తిచేస్తే వ్యాధిని నయం చేయవచ్చు. చికిత్సను ఆలస్యం చేయడం వల్ల నరాలు దెబ్బతినడం, చేతులు, కాళ్లలో స్పర్శ జ్ఞానం కోల్పోవడం, వైకల్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.కుష్టు వ్యాధి అంటువ్యాధి అయినప్పటికీ, సాధారణంగా కరచాలనం చేయడం, పక్కపక్కన కూర్చోవడం లేదా కలిసి భోజనం చేయడం ద్వారా వ్యాపించదు. వ్యాధి గురించి సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారికి సహకరించాలని వైద్యాధికారులు కోరారు.
ఆశా కార్యకర్తలకు సహకరించాలిప్రతి గ్రామంలోని ప్రజలు, కుటుంబ యజమానులు తమ ఇళ్లకు వచ్చే ఆశా కార్యకర్తలకు పూర్తి సహకారం అందించాలని జిల్లా వైద్యాధికారి విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సరిగ్గా తెలియజేసి, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వైద్య పరీక్షలకు పంపించేందుకు సహకరించాలని కోరారు.
సర్వేలో అనుమానితులుగా గుర్తించిన వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా అందుబాటులో ఉన్న చికిత్సను పొందేలా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
కుష్టు వ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ నెల 22వ తేదీ గురువారం నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వేను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్‌కుమార్, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎల్లయ్య, హెల్త్ సూపర్వైజర్ సులోచన, హెల్త్ అసిస్టెంట్లు కృష్ణమూర్తి, సత్యప్రకాష్, నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, 40 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్, పద్మయ్య, ధర్మసాగర్ హనుమకొండ జిల్లా