రావణాసుర వధకు సర్వం సన్నద్ధం
ధర్మసాగర్ , మేజర్ న్యూస్, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నేడు నిర్వహించ నున్న దసరా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా పాల్గొనాలని కోరుతూ ఉత్సవ కమిటీ సభ్యులు ధర్మసాగర్ సీఐ అనుముల శ్రీనివాస్ ను ఆహ్వానించారు. ధర్మసాగర్ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న భారీ విగ్రహాన్ని చూడడానికి గ్రామాలకు చెందిన పలువురు భక్తులు రావణాసుర వదలను తిలకించడానికి వస్తారు.పోలీస్ స్టేషన్లో ఉత్సవ కమిటీ సభ్యులు ఉప్పరపు నాగరాజు రజనీకాంత్ రాములు కనకరాజు, కోటేశ్వర్ లతో కూడిన బృందం సిఐని కలిసి సన్మానం చేసి దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు.
రిపోర్టర్: పద్మయ్య, ధర్మసాగర్, హనుమకొండ జిల్లా