BREAKING
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. గ్రంథాలయం వద్ద హ్యాండ్ రైటింగ్ పోటీలు. *కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు* *మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజ్* ట్రంప్‌కు షీ జిన్‌పింగ్ ఘనస్వాగతం.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్

వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

Select Suryaa Now
వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

• ఆరోగ్య కార్యక్రమాలు 100 శాతం పూర్తి చేయాలి 

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ బుధవారం తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించి వైద్యులు, వైద్య సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య కార్యక్రమాల సమీక్షను దృష్టిలో ఉంచుకుని, అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సిబ్బంది సమన్వయంతో 100 శాతం లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.

మాతా శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులందరినీ 100 శాతం నమోదు చేయడంతో పాటు వైద్యాధికారి పర్యవేక్షణలో నాలుగు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. 102 అమ్మ ఒడి అంబులెన్స్ సేవలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ వ్యాయామాలు, వైద్యుల సూచనలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని, 'సాధారణ ప్రసవాలే ముద్దు.. సిజేరియన్లు వద్దు' అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు.

ప్రతి బుధ, శనివారాల్లో నిర్వహించే టీకాల కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టి, చిన్నారులకు అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయంలో ఇప్పించాలని ఆదేశించారు. టీకాల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు ముందస్తు అవగాహన కల్పించాలన్నారు.

క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి క్రమం తప్పకుండా మందులు అందించడంతో పాటు వ్యాధి నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. బీపీ, షుగర్ వంటి అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ-సంజీవని, ఈ-ఔషధి, మానసిక ఆరోగ్య కార్యక్రమం, టెలీ మానస్, కుష్టు వ్యాధి నియంత్రణ, కీటక జనిత వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలు, వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, వివిధ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.

వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ హెచ్చరించారు. వైద్యాధికారి, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, పర్యవేక్షకురాలు మార్త, వైద్య సిబ్బంది, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.