BREAKING
కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ

యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి

Select Suryaa Now
యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి సూచించారు. గ్రంథాలయాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో పాటు భవిష్యత్తులో ఇంటర్నెట్ సౌకర్యంతో కూడిన ఈ-గ్రంథాలయాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.బుధవారం కీసరలో రూ.1.50 కోట్లతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను పరిశీలించారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందుబాటులో ఉంచిన గ్రంథాలయ చైర్మన్, సిబ్బందిని అభినందించారు.ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత మొబైల్ ఫోన్లు, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. అలియాబాద్‌లో రూ.50 లక్షలతో ప్రారంభించిన గ్రంథాలయానికి కూడా ఈ-గ్రంథాలయ సదుపాయం కల్పించాలని కోరారు.ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు యువత భవిష్యత్తుకు మార్గదర్శకాలుగా నిలుస్తాయని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని అన్నారు. ప్రభుత్వం గ్రంథాలయాల్లో పుస్తకాలు, ఆధునిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని తెలిపారు.డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధితో విద్య, విజ్ఞానం పెంపొందడమే కాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ

అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను అలియాబాద్‌లోని ఏఆర్‌కే గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 316 మందికి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 378 మందికి పింఛన్లను అందజేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని నాయకులు సూచించారు.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, నక్క ప్రభాకర్ గౌడ్, అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహ యాదవ్, ఆర్డీవో నల్ల వెంకట్ రెడ్డి, తహసీల్దార్ యాదగిరి రెడ్డి, గ్రంథపాలకురాలు అనురాధ, శామీర్‌పేట డివిజన్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు నక్క సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు డి.వెంకటేష్, తుంకి రమేష్, కీసర డివిజన్ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, గుర్రం శ్రీధర్ రెడ్డి, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, నారాయణ శర్మ, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.