BREAKING
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. గ్రంథాలయం వద్ద హ్యాండ్ రైటింగ్ పోటీలు. *కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు* *మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజ్* ట్రంప్‌కు షీ జిన్‌పింగ్ ఘనస్వాగతం.. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్

కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Select Suryaa Now
కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కావలి,  మేజర్ న్యూస్ :    మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కావలిలో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డితో పాటు 44 మంది వార్డు అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో బీ-ఫారాలు అందజేశారు. అనంతరం అభ్యర్థులకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అల్లూరులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని కలిసి నగర పంచాయతీ ఎన్నికలపై చర్చించారు.ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు, బెదిరింపులు, అక్రమ కేసుల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, మహిళల నామినేషన్ పత్రాలను చించివేయడం దారుణమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సూచనల మేరకు కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డిని ఖరారు చేసినట్లు తెలిపారు. పార్టీ అభ్యర్థులంతా ధైర్యంగా ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మద్దతు కూడగట్టాలని సూచించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికల్లో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. పోలీసు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎన్నికల్లో గెలవాలని చూడటం సరికాదన్నారు. నిజంగా ప్రజాబలం ఉంటే వైసీపీ అభ్యర్థులతో నేరుగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోరాట పటిమను కాకాణి అభినందించారు. ఆయనకు పార్టీ నాయకులంతా అండగా ఉంటారని, అందరూ ఐక్యంగా ఎన్నికలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని కాకాణి కోరారు.