BREAKING
వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు విజయలక్ష్మి కనెక్ట్ విత్ జెన్ జీ పొలిటికల్ అకౌంటబిలిటీ-న్యూ ఏజ్ పాలిటిక్స్ విద్యార్థి దశ నుంచే చట్టంపై అవగాహన కలిగి ఉండాలి పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో ఆర్థిక భరోసా -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ నామినేషన్లకు పటిష్ట బందోబస్తు ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.. గ్రంథాలయం వద్ద హ్యాండ్ రైటింగ్ పోటీలు. *కార్తీక మాసం ప్రత్యేకం.. ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు* *మధిర డిపో మేనేజర్ తడికమళ్ళ దేవరాజ్*

ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

Select Suryaa Now
ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

హిందూపురం నుండి ఢిల్లీ దాకా-జీవన జాథా తో హోరెత్తిన డిమాండ్లు...


హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:

డిసెంబర్ 1,2,3 తేదీల్లో ఢిల్లీలో జరిగే మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సత్యసాయి జిల్లా హిందూపురంలో జీవన జాథా ప్రారంభమైంది. ఈ సందర్భంగా   తూముకుంట, వాణీ నగర్, పట్టణంలోని  బీపీఎల్ షోరూం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్ల, పాలసముద్రం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
ఈ జాథాను సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్పీ శ్రీనివాసులు  జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు విఆర్ రాము  మాట్లాడుతూ...

- సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం కార్మికులకు రూ.42,000 వేతనం ఇవ్వాలని
- ఉద్యోగ భద్రత కల్పించాలని
- పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని
- రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని
- వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పని, రూ.700 కూలీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై యూనియన్ జిల్లా కార్యదర్శి పెనుగొండ నాగరాజు, కెవిపిఎస్ జిల్లా నాయకులు కిరణ్, మున్సిపల్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మురళి, నరసింహమూర్తి, శివ, సప్లై యూనియన్ కార్యదర్శి శ్రీరాములు, ఆటో యూనియన్ నాయకులు అంజి, బాబు రెడ్డి, నరసప్ప, గురు, చలివిందుల బాబా తదితరులు పాల్గొన్నారు.

---

-నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ నాగరాజు, హిందూపురం