సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు
గుంటూరు : సెన్సస్–2027 నిర్వహణలో భాగంగా ఫీల్డ్ ట్రైనర్లకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జిల్లా కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, జనాభా గణన ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తూ, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సెన్సస్ విధివిధానాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు డిసెంబర్ 3వ తేదీ నుంచి జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ అందించనున్నారని తెలిపారు. జనాభా గణనకు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి స్పష్టమైన అవగాహన కల్పించి, సెన్సస్–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా సిద్ధం చేయాలని సూచించారు. జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా సెన్సస్ కోఆర్డినేటర్లు ఆదిలక్ష్మి, రమణ పాల్గొన్నారు.
సూర్య నాయక్