BREAKING
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు

Select Suryaa Now
బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు ప్రాంతంలో అవసరమైన చోట్ల బస్ షెల్టర్లు లేక  కొన్నిచోట్ల అవసరం లేకున్నా రెండు నిర్మించి అవి అక్కరకు రాకుండా చేశారని, ఈ సమస్య గురించి ప్రయాణికులు ప్రజలు అరిచి గీ పెడుతున్న ఏ మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని పలు గ్రామాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు షెల్టర్ల నిర్మాణాలు విషయం ప్రభుత్వాలు కొంతకాలంగా గాలికి వదిలేసినట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. నెల్లూరు ముంబై రహదారిపై నారంపేట బస్టాండ్ వద్ద అవసరం లేకున్నా రెండు బస్టాండ్లు నిర్మించారు. వెంకట్రావు పల్లి వద్ద గతంలో ఉన్న షెల్టర్ ను ఒక లారీ ఢీ కొనగా మరమ్మత్తులు చేయకుండా పూర్తిగా తొలగించారు. శాంతినగర్ వద్ద ఒక షెల్టర్ నిర్మించి దశాబ్దం దాటినా అందులోకి వెళ్లే దారి లేకుండా నిరుపయోగంగా  దర్శనమిస్తోంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై నెల్లూరు పాలెం సమీపంలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ వద్ద నిత్యం విద్యార్థులు, సిబ్బంది షెల్టర్ లేక ఎండలో వానలో బస్సుల కోసం వేచి ఉంటుంటారు. నెల్లూరు పాలెం వద్ద బస్టాండ్ కు దూరంగా షెల్టర్లు నిర్మించగా అవి నిరుపయోగంగా ఉన్నాయి జాతీయ రహదారిపై ప్రముఖ యాత్ర స్థలం ఏ ఎస్ పేట కు వెళ్లే రోడ్ వద్ద ఒక షెల్టర్ నిర్మించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేరు. నువ్వూరుపాడు మజరా అంబేద్కర్ నగర వద్ద షెల్టర్ లేనందున ఒక చెట్టు జనాలకు షెల్టర్ గా ఉండగా వర్షాకాలం తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. నాగులపాడు రోడ్డు కూడలి వద్ద బస్ షెల్టర్ లేక ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. అన్నింటికన్నా ప్రధానమైన ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఎదుట బస్ షెల్టర్ లేనందున ఎండలో వానలో రోగులు, వారి బంధువులు, హాస్పిటల్ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. గతంలో ఒక ట్రస్ట్ వారు చిన్నపాటి షెల్టర్ నిర్మించగా ఎవరో తొలగించారు. ఇటీవల తీవ్రమైన ఎండల్లో నిత్య అన్నదాత కంచి పరమేశ్వర్ రెడ్డి అక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి ఒక పందిరి వేసి బెంచీలు ఏర్పాటు చేయగా వాటిని జనాలు షెల్టరుగా వినియోగించుకుంటున్నారు. జనాలు అవస్థలు అసౌకర్యాలను  ఇప్పటికైనా అధికారులు కానీ పాలకులు గాని పట్టించుకుని బస్ షెల్టర్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు.