ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం
వేమూరు(భట్టిప్రోలు) మేజర్ న్యూస్:
వేమూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా అమ్మిశెట్టి శైలజకిషోర్ గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈనెల ఐదున జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో కాకర్లమూడి గ్రామానికి చెందిన అమ్మిశెట్టి శైలజ ఎంపీపీ అభ్యర్థిగా పోతుమర్రు ప్రాదేశిక నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించడంతోపాటు టిడిపి ప్యానెల్ అభ్యర్థులు గెలుపొందారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు అమ్మిశెట్టి శైలజను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో గురువారం జరిగే ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికకానున్నారు. అదేవిధంగా మండల పరిషత్ ఉపాధ్యక్షురాలుగా చావలి 1 ప్రాదేశిక నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన గోపిశెట్టి విజయ ఎంపికకా నున్నారు. అదేవిధంగా కో ఆప్షన్ సభ్యుల ఎంపిక కూడా అదే రోజు ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలియజేశాయి. మండల పరిషత్ వ్యవస్థ ఏర్పడిన నాటి నుండి వేమూరు మండలంలో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా తమ ఆధిపత్యాన్ని చాటుకుని ఎంపీపీ స్థానాన్ని సాధించడం పట్ల టిడిపి శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు.