గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులోని శ్రీ మాటూరు రామారావు శాఖ గ్రంథాలయంలో 59 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజైన బుధవారం చిత్రలేఖనం పోటీలను నిర్వహింఛారు. ఈ చిత్రలేఖనం పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మనసులోని భావాలను రంగుల రూపంలో ప్రపంచానికి సూపించే కల ఒక చిత్రం. వెయ్యి మాటలకు సమానం ప్రతి చిత్రంలో ఒక కథ ఉంటుందని చిత్రకారుడు తన కలాన్ని రంగులతో మాట్లాడిస్తాడని, చిత్రలేఖనం అనేది హృదయంతో మాట్లాడే భాష అని విద్యార్థులు ప్రతిరోజు గ్రంథాలయము నందు వచ్చి విజ్ఞానమును పెంచుకోవాలని, గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకుని పుస్తకాలను తీసుకువెళ్లి చదువుకునే అలవాటు పెంచుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శాఖ గ్రంథాలయ అధికారి కలపాల సుభాష్ చంద్రబోస్, విద్యార్థులు పాల్గొన్నారు.