శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం
వింజమూరు, మేజర్ న్యూస్ : వింజమూరులోని శాఖ గ్రంథాలయంలో 59 వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు గ్రంథాలయాధికారి జ్యోతి కొండయ్య ఆధ్వర్యంలో కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలురు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు పిచ్చయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలను తెలుసుకునేందుకు జ్యోతిష్యం తదితరు అంశాలు ఉపయోగపడతాయని అలాగే విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కగా చదవాలని తెలిపారు అలాగే విద్య ఎలా నేర్చుకోవాలి అంశంపై సదస్సు లాంటి అంశాన్ని నిర్వహించారు విద్యార్థులందరూ నేటి నుండి సక్రమంగా తమ లక్ష్యాన్ని సాధించే విధంగా కష్టపడి చదవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు