BREAKING
గురుకుల పాఠశాలలో దోమతెరల పంపిణి. పొదలకూరు వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ నేత కోనం బ్రహ్మయ్య! ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అందరూ గర్వపడేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్, సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు కావలి 13వ వార్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభం; ఇంటింటి ప్రచారం... ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది.. ఫ్యామిలీతో కలిసి చూడండి: డైరెక్టర్ పవన్ సాధినేని నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని

పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :     రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఆత్మకూరు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు శనివారపు మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ఒక్క పంచాయతీ కూడా చేజారకుండా అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి కి ఘనమైన కానుకగా అందించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి శనివారపు మోహన్ రెడ్డి మాట్లాడుతూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు మరియు బీఎల్ఏ  లు అందరూ ఒకే తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
తాజాగా ఎన్నికైన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరినీ కలుపుకొని ఎన్నికల రణరంగంలో ముందుకు సాగాలన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఏ ఒక్క పంచాయతీ మిస్ కాకుండా అన్ని చోట్లా టీడీపీ జయకేతనం ఎగరేయడమే మనందరి ప్రధాన లక్ష్యం కావాలన్నారు.
పార్టీ క్యాడర్ అంతా ఐకమత్యంతో కష్టపడి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని మోహనరెడ్డి కోరారు.