BREAKING
గురుకుల పాఠశాలలో దోమతెరల పంపిణి. పొదలకూరు వైఎస్సార్సీపీ సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ నేత కోనం బ్రహ్మయ్య! ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ అందరూ గర్వపడేలా ఉంటుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విశ్వక్ సేన్, సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు కావలి 13వ వార్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభం; ఇంటింటి ప్రచారం... ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది.. ఫ్యామిలీతో కలిసి చూడండి: డైరెక్టర్ పవన్ సాధినేని నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని

మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు

Select Suryaa Now
మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు

గుంటూరు : సాక్షి దినపత్రికలో మహిళల వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా ప్రచురించిన కథనంపై గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ  సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి ఒక మహిళగా తీవ్రంగా కలత చెందానని, అందుకే రాజకీయాలకు అతీతంగా మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారు. రాజకీయ విమర్శలు సహజమని, కానీ విమర్శల పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం, హేళన చేసేలా రాతలు రాయడం సరికాదన్నా రు.వైఎస్ షర్మిల తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలవడాన్ని సాక్షి మీడియా వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. ఒక తండ్రి వయసున్న వ్యక్తి వద్దకు వెళ్లి తన ఇంటి శుభకార్యానికి ఆహ్వానించ డం సహజమైన విషయమని, దానిని ఉద్దేశించి 'బాబుగారితో చట్టాపట్టాలు' అంటూ శీర్షిక పెట్టడం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి శుభకార్యాలకు ఆహ్వానించడం షర్మిల హుందాతనానికి నిదర్శనమన్నారు. సాక్షి మీడియాను నడిపిస్తున్నది కూడా ఒక మహిళేనని, కనీసం మహిళగా మరో మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే రాతలను అడ్డుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. సంపాదకులు, ప్రూఫ్ రీడర్లు ఇలాంటి అభ్యంతరకరమైన పదజాలాన్ని గుర్తించి తొలగించాల్సి ఉందన్నారు. గతంలో అమరావతి మహిళా రైతులపై, ఇతర మహిళా నాయకుల వేషధారణ, వ్యక్తిత్వాలపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా గుర్తుచేశారు. విమర్శకు, వ్యక్తిత్వ హననానికి మధ్య తేడాను గుర్తించాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు అతీతంగా అందరినీ గౌరవించే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. నారా లోకేష్‌పై గతంలో వ్యక్తిగత విమర్శలు వచ్చినప్పుడు ఆయన హుందాగా స్పందించిన తీరును ప్రస్తావించారు. వ్యక్తిత్వం, రాజకీయ అనుభవం విషయంలో చంద్రబాబుతో జగన్ తనను తాను పోల్చుకోవడం సరికాదన్నారు. గతంలో షర్మిల తన కుమారుడి వివాహ ఆహ్వానం అందించేందుకు వెళ్లినప్పుడు ఆమె ధరించిన పసుపు రంగు చీరపైనా సాక్షి మీడియా విమర్శలు చేయడం వారి ఆలోచనా ధోరణికి నిదర్శనమన్నారు. సొంత సోదరి విషయంలోనే ఇంతటి కించపరిచే ధోరణి ఉంటే, గత ఐదేళ్ల పాలనలో ప్రజల పట్ల ఏ విధంగా వ్యవహరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చన్నారు. వైసీపీకి అనుకూలంగా లేరనే కారణంతో అధికారులు, సామాన్యులు, కార్యకర్తలను వేధించిన పరిస్థితులను ప్రజలు మరచిపోలేదన్నారు.జగన్ చేస్తున్న ప్రతీకార వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 11 సీట్లకు పరిమితం చేసిన ప్రజలపైనా, తమను ప్రశ్నిస్తున్న మహిళలపైనా, యువతపైనా ప్రతీకారం తీర్చుకుంటారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించాలని, ఇలాంటి ధోరణితో 2029లో మళ్లీ అధికారంలోకి వస్తామని ఎలా భావిస్తున్నారని నిలదీశారు.తాను రాజకీయాల్లోకి వచ్చి కొద్దికాలమే అయినప్పటికీ వివక్షకు తావులేకుండా ప్రజాసేవ చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 550కు పైగా మార్కులు సాధించిన 40 నుంచి 50 మంది విద్యార్థులను ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లినప్పుడు వారి తల్లిదండ్రులు ఏ పార్టీకి చెందినవారనే విషయం చూడలేదన్నారు. ప్రతిభ ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేశామని, వారిలో వైసీపీకి మద్దతిచ్చే కుటుంబాల పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం కూడా తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన కుటుంబాలకు అందిస్తోంద న్నారు.అభిమానం వేరు, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నాయకత్వాన్ని ఎంచుకోవడం వేరని ప్రజలు గుర్తించాలని కోరారు. మీడియా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారంగా రాతలు రాయడానికి, మహిళల గౌరవాన్ని దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడమే మీడియా బాధ్యతని, రాజకీయ నాయకుల తప్పులను కప్పిపుచ్చే సాధనంగా మారకూడదని హితవు పలికారు.మహిళలు రాజకీయాల్లోకి వచ్చి సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వస్తున్నారని, ఇలాంటి వ్యక్తిత్వ హననాలు, సోషల్ మీడియా దాడులు వారిలో భయాన్ని కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ కూటమి ప్రభుత్వం వారికి పెద్దపీట వేస్తోందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా మహిళల పట్ల తన వైఖరిని మార్చుకోవాలి. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచే రాతలు, వ్యాఖ్యలు మానుకోవాలి. మహిళలను గౌరవించడం చేతకాకపోతే కనీసం వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించకుండా ఉండాలి. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలను మహిళా లోకం క్షమించదు. రానున్న రోజుల్లో మహిళలే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరించారు.

సూర్య నాయక్