భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు పట్టణ పరిధిలోని పొలాల వద్ద రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న పొలాల రీ సర్వే ప్రక్రియను బుధవారం ఆర్డీవో బి.పావని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూముల వద్ద సర్వే నిర్వహిస్తున్న అధికారుల పనితీరును పరిశీలించి, రీ సర్వే విధానాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రీ సర్వే ద్వారా కలిగే ప్రయోజనాలు, రైతులకు చేకూరే లబ్ధిని అక్కడి రైతులకు వివరించారు.రీ సర్వేలో ఎటువంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియపరచాలన్నారు.. ఈ సర్వేలో పొలాల రైతులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.