BREAKING
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే

Select Suryaa Now
మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   ఆత్మకూరు మండలపరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక గురువారం జరుగుతుందని స్థానిక ఎంపిడివో పి. రఫీ ఖాన్ తెలిపారు.
ముందుగా కోఆప్షన్ సభ్యుని ఎన్నిక జరుగుతుందన్నారు.
19వతేదీ ఉదయం 10 గంటల లోపల నామినేషన్లను సమర్పించవలసి ఉంటుందన్నారు.
10 నుంచి 12 గంటల మధ్య నామినేషన్ల పరిశీలన జరుగుతుందని,12 గంటలకు చెల్లుబాటైనా నామినేషన్ల జాబితా ప్రచురించబడుతుందని, 
12.00  నుండి 1.00  మధ్య ఉపసంహరణలు,
ఒంటిగంటకు  ఎంపీటీసీ సభ్యుల ల ప్రమాణ స్వీకారం అనంతరం కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరుగుతుందన్నారు.
ఒకే నామినేషన్ ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించబడుతారని,
ఒకటి కన్నా ఎక్కువ నామినేషన్లు వస్తే   ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తే ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారన్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు మండల అధ్యక్షులు,  మరియు ఉపాధ్యక్షులు ఎన్నిక జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ ఎన్నికలు  ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తే ప్రక్రియ ద్వారా జరుగుతుందని రఫీఖాన్ పేర్కొన్నారు.