BREAKING
కావలి 13వ వార్డులో టీడీపీ కార్యాలయం ప్రారంభం; ఇంటింటి ప్రచారం... ‘ఆకాశంలో ఒక తార’ తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది.. ఫ్యామిలీతో కలిసి చూడండి: డైరెక్టర్ పవన్ సాధినేని నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు

అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు

Select Suryaa Now
అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు

ఆత్మకూరు,మేజర్ న్యూస్ :   దశాబ్దాలు గడిచిపోతున్న ప్రభుత్వాలు మారుతున్న ఆత్మకూరు ప్రాంతంలో చేనేత కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదని కార్మికులు ఆవేదనతో చెబుతున్నారు. ప్రభుత్వం మగ్గాలున్న వారికి ఏదో ఆర్థిక తాత్కాలకు సాయం అందించారే తప్ప తమ వృత్తిని అభివృద్ధి పరిచేలా అధునాతన విధానంలో చేనేత సాగించేలా మరమగ్గాలను సమకూర్చే యోచన ఏ ప్రభుత్వం చేయడం లేదని వారు వాపోతున్నారు. ఆత్మీకూరు తాలూకాలోని ఆత్మకూరు, సంఘం,పొంగూరు, పోలిరెడ్డిపల్లి, కే. యడవల్లి,  హసనాపురం, ఏఎస్పేట, గండువారిపల్లి,  జమ్మవరం, దూబగుంట, చందలూరుపాడు తదితర గ్రామాల్లో చేనేత కార్మికులు ఉన్నారు. అయితే గతంలో లాగా వారు చేనేత వృత్తి సాగిస్తే గిట్టుబాటు ధర లభించడం లేదు. దాంతో చాలామంది వృత్తికి దూరమవుతున్నారు. కానీ ఇతర వృత్తుల్లో సాగలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వారిలో మగ్గాలు ఉన్నవారికి ప్రభుత్వం తాత్కాలిక ఆర్థిక సాయం అందించినా ఫలితం లేదని, శాశ్వత ప్రాతిపదికన తమ వృత్తిని సాగించాలంటే  తమకు కొంత శిక్షణ ఇచ్చి ఆధునిక మరమగ్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఉపాధి పొందగలమని, గతంలో లాగా బ్రతుకు సాగించగలమని చెబుతున్నారు. 1975 వరకు తమ చేనేత వృత్తి బాగుండేదని, అనంతరం గిట్టుబాటు గాని పరిస్థితి ఏర్పడిందని,తమకు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించలేదని వారు చెబుతున్నారు.ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వీవర్స్ కాలనీ వాసులు చెబుతున్నారు.చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరిగినా ఆ గిరాకీ కి తగ్గట్టుగా తాము అధునాతన రీతిలో నేత నేసే పరిస్థితి లేదని, నాటు మగ్గాలపై సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. ఆత్మకూరు వీవర్స్ కాలనీలో పాతికేళ్ల క్రితం 50 కుటుంబాల వారు ప్రభుత్వం అప్పట్లో మంజూరు చేసిన చిన్నపాటి గృహాలు నిర్మించుకున్నారు. కుటుంబాల సంఖ్య 71 పెరిగినా ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లభించలేదని, తమకు పాఠశాల లేదని, అంతర్గత రహదారులు లేకపోగా అరాకొరగా వేశారని, సైడ్ కాలవల్లేవని, కాలనీలో ఆక్రమణలు పెరిగిపోయాయి అని, తమ వృత్తి గిట్టుబాటు కాక కొందరు వలసి వెళ్లారని చెబుతున్నారు.మగ్గాలున్న వారికి ప్రభుత్వం 24000 సాయం అందించిందని కానీ శాశ్వత ప్రాతిపదికన మరమగ్గాలు మంజూరు చేయాల్సిన అవసరం అనివార్యమని వారు చెబుతున్నారు.గతంలో నెల్లూరు పాలెం పంచాయతీలో ఉన్న తమ ఓట్లు మాత్రం ఆత్మకూరు పంచాయతీలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోలేదని, అయితే మున్సిపల్ పరిధిలో చేర్చినా తగిన  మౌలిక వసతులు కల్పించలేదని, గృహాలకు మరమ్మత్తులు లేదా కొత్తగా ఇల్లు మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. తమ కాలనీ నుండి రోడ్లు వెంబడి చిన్నారులు ఆత్మకూరు పట్టణంలోకి బడికి వెళ్లడం ఇబ్బందికరంగా ఉందని, తమ కాలనీలోనే ఒక స్కూల్ ఏర్పాటు చేయాలన్న కోరిక కంఠశోష గాని మిగిలిందని వారు పేర్కొన్నారు.పవర్ లూమ్స్ మంజూరుకు అనేక దపాలు విన్నపాలు చేసినా ఎవరు పట్టించుకోలేదని కూడా వారు ఆవేదనతో చెబుతున్నారు.పాతికేళ్లకు ముందు నిర్మించిన చిన్నపాటి కాలనీ గృహాలు శిథిలం కాగా వాటి మరమ్మతులకు సాయం అందించాలని ప్రభుత్వానికి విన్నపాలు చేసిన ఫలితం లేకపోయిందని వారు చెబుతున్నారు. తమ చేతి వృత్తికి ఆధునికత కల్పిస్తే జీవనశైలి మారుతుందని, తగిన ఉపాధి లభిస్తుందని వారు చెబుతున్నారు. పాతికేళ్ల క్రితం ఇచ్చిన గృహాల స్థానే కొత్తగా పక్క గృహాలు మంజూరు చేయాలని కూడా వారు కోరుతున్నారు.శిక్షణ కార్యక్రమం తమ కాలనీలో ఏర్పాటు చేసి శిక్షణానంతరం సబ్సిడీతో పవర్ లూమ్స్ మంజూరు చేసేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నెల్లూరు, వెంకటగిరి లాగా ఆత్మకూరు ప్రాంతంలో కూడా చేనేత వృత్తిని అభివృద్ధి చేసి తమ జీవనోపాధి గురించి ప్రభుత్వం పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.