సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు
సైదాపురం, మేజర్ న్యూస్ : సైదాపురం మండలంలో గురువారం జరగనున్న ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సైదాపురం ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లను పోలింగ్ అధికారి కె. వెంకటేశ్వరరావు, ఎంపీడీవో కె. రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా పోలింగ్ అధికారి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉదయం 9 గంటలకు కోఆప్షన్ సభ్యుల నామినేషన్లు స్వీకరిస్తామని, అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులు చేతులెత్తే విధానంలో తమ మద్దతు తెలియజేసి ఎంపీపీని ఎన్నుకుంటారని వివరించారు.అయితే స్థానిక కేబుల్ ఛానళ్ల ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల కేంద్రంలోకి ప్రవేశించేందుకు కవరేజ్ పాసులు జారీ చేయబోమని పోలింగ్ అధికారి స్పష్టం చేశారు. దీంతో స్థానిక మీడియా ప్రతినిధులకు ఎన్నికల కవరేజ్‌పై పరిమితులు విధించడంపై చర్చకు దారితీసింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె. రామ్మోహన్ రెడ్డి, ఏవో మురళీకృష్ణ, సిబ్బంది భానుప్రకాష్, ప్రవీణ్, సతీష్, కోటి తదితరులు పాల్గొన్నారు.