రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి*
*కర్నూలు/నవంబర్:18 రైల్వే డబుల్ లైన్ పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పేర్కొన్నారు.
బుధ వారం రైల్వే డబుల్ లైన్ పనులకు భూసేకరణ పై కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాll వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... డబుల్ లైన్ రైల్వే పనుల నిర్వహణ కోసం భూ సేకరణ త్వరగతిన పూర్తి చేసి రైల్వే శాఖకు సంబంధిత భూమిని అందజేయాలని ఆదేశించారు...
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ..మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో కర్నూలు రూరల్, కల్లూరు, వెల్దుర్తి మండలాల పరిధిలో కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎకరాల భూసేకరణకు సంబంధించిన అవార్డు ప్రక్రియ చివరి దశలో ఉందని, భూసేకరణకు సంబంధించి అవార్డు ఎంక్వైరీ పూర్తయిందని, రైల్వే శాఖ నుంచి ఆమోదం లభించిన వెంటనే అవార్డు పాస్ చేసి, తదుపరి భూములను రైల్వే శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదనపు భూసేకరణకు సంబంధించి పెగ్ మార్కింగ్ ప్రక్రియను నాలుగు రోజుల క్రితమే పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ, నవంబర్ 24వ తేదీలోగా అదనపు భూసేకరణకు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.