BREAKING
నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగరాణి నామినేషన్ల స్క్రూట్ ని కేంద్రాన్ని పరిశీలించిన డి.ఎస్.పి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 'ఆకాశంలో ఒక తార' ఎందుకు అంత ప్రత్యేకం? నవంబర్ 20న బాక్సాఫీస్ బరిలోకి.. గ్రంథాలయంలో చిత్రలేఖన పోటీలు శాఖ గ్రంథాలయంలో కవి సమ్మేళనం పంచాయతీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి - మంత్రి ఆనంకు ఘనమైన కానుక అందిద్దాం ఎంపీపీగా గురువారం అమ్మిశెట్టి శైలజ ప్రమాణస్వీకారం నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో పావని మహిళల గౌరవాన్ని కించపరిచే రాతలు మానుకోవాలి జగన్‌కు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హితవు భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన ఆత్మకూరు ఆర్డీవో బి.పావని అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం

కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ

Select Suryaa Now
కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ జనరల్‌ మేనేజర్‌ (జీఎం) శ్రీ సందీప్‌ మాథుర్‌ గారు బుధవారం నెల్లూరు రైల్వేస్టేషన్‌ తనిఖీకి విచ్చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి   ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ ప్రతినిధి పెంచల రెడ్డి జీఎంను కలిసి ఎంపీ   రాసిన లేఖను అందజేశారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక రైల్వే సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు, వాహనదారులు ఈ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని ఎంపీ గారు లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే శాఖ మంత్రికి పలుమార్లు లేఖలు రాసినట్లు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జీఎం స్థాయిలో ప్రత్యేకంగా చొరవ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎంపీ   కోరినట్లు ప్రతినిధి తెలిపారు.

నెల్లూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ
అమృత్ పథకం కింద నిధులు మంజూరైనా, నెల్లూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తికాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎంపీ  పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 12న జీఎం   నెల్లూరు పర్యటన సమయంలో ఈ విషయాన్ని తన కార్యాలయ ప్రతినిధి ద్వారా ఇప్పటికే ఆయన దృష్టికి తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. పనులు వేగంగా పూర్తయ్యేలా గడువు నిర్ణయించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

గాంధీ గిరిజన కాలనీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి
నెల్లూరులోని వెంకటేశ్వరపురం సమీపంలో గాంధీ గిరిజన కాలనీ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మించాలని కోరారు. రైల్వే ట్రాఫిక్‌ ఆంక్షలు, సరైన క్రాసింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల గాంధీ గిరిజన కాలనీ, పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అండర్‌ బ్రిడ్జి నిర్మిస్తే రాకపోకలు సాఫీగా సాగి, నివాస ప్రాంతాలకు సురక్షిత మార్గం ఏర్పడుతుందని తెలిపారు. దీనిపై జులైలోనే సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం కి లేఖ రాసినట్లు గుర్తుచేశారు.

రైల్వే భూముల సుందరీకరణ
ఆత్మకూరు బస్టాండ్‌ నుంచి పెన్నా నది వరకు మినీ బైపాస్‌ రోడ్డు వెంట ఉన్న రైల్వే భూముల్లో భూమి సుందరంగా తీర్చిదిద్దడం, మొక్కల పెంపకం, కాంపౌండ్‌ ఫెన్సింగ్‌ వంటి పనులు చేపట్టాలని కోరారు. దీనివల్ల పట్టణ వాతావరణం మెరుగుపడటంతో పాటు ఆక్రమణలు, చెత్త వేయడం, భూముల దుర్వినియోగం అరికట్టవచ్చని తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ, ఇతర స్థానిక సంస్థల సమన్వయంతో ఈ పనులు చేపట్టాలని పేర్కొన్నారు.

ఆటో డ్రైవర్లకు పార్కింగ్‌ సౌకర్యం
నెల్లూరు రైల్వేస్టేషన్‌ వద్ద ఆటో డ్రైవర్లకు ప్రత్యేక పార్కింగ్‌ లేక ఇబ్బంది పడుతున్నారని ఎంపీ  పేర్కొన్నారు. పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆటోల రాకపోకలు క్రమబద్ధమై, స్టేషన్‌ ప్రవేశద్వారం వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని తెలిపారు. తగిన స్థలాన్ని గుర్తించి పార్కింగ్‌ కేటాయించాలని విజయవాడ డివిజన్‌ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

టపాతోపు అండర్‌పాస్‌ విస్తరణ
కొడవలూరు మండలం నార్త్‌ రాజుపాళెం సమీపంలోని టపాతోపు లెవల్‌ క్రాసింగ్‌ నంబరు 127 అండర్‌పాస్‌ను పూర్తిస్థాయి డబుల్ లేన్‌గా విస్తరించాలని కోరారు. ఈ అండర్‌పాస్‌కు పడమర వైపు రెండు వరుసలు, తూర్పు వైపు ఒక్క వరుసే ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వ్యవసాయ రవాణా, వాణిజ్య వాహనాలు, స్థానికుల రాకపోకలు సురక్షితంగా సాగాలంటే విస్తరణ అవసరమని తెలిపారు.

నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌
వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని ఎంపీ  పేర్కొన్నారు. రైల్వే కనెక్టివిటీ పెరిగి, ప్రయాణికుల రాకపోకలు, వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు, ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతాయని తెలిపారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని సమీక్షించి, భూసేకరణ, అనుమతులు, నిధులు, పనుల అమలులో ఏవైనా అడ్డంకులు ఉంటే గుర్తించి, రైల్వే బోర్డు, ఇతర అధికారుల సమన్వయంతో పనులు వేగవంతం చేయాలని కోరారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి లేఖ రాసినట్లు గుర్తుచేశారు.

ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, సంబంధిత డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు, ఇతర అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ గారు కోరినట్లు జనరల్‌ మేనేజర్‌కి పెంచల రెడ్డి తెలియజేశారు. ఒక్కో పని ప్రస్తుత స్థితి, చేపట్టనున్న చర్యలు, ఆర్థిక అంచనాలు, పూర్తికి పట్టే సమయంతో కూడిన సమగ్ర నివేదికను ఎంపీ గారి కార్యాలయానికి పంపాలని కూడా కోరారు.