విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
నగరం, మేజర్ న్యూస్: మండల పరిధిలోని మంత్రిపాలెం శాఖా గ్రంథాలయంలో 59వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు గ్రంథాలయాల వల్ల ఉపయోగాలు, ప్రకృతి వైపరీత్యాలపై వ్యాసరచన పోటీలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ నిర్వహణాధికారి జొన్న బ్రహ్మేంద్ర, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.