వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు....
రాపూరు, మేజర్ న్యూస్ : మరణించిన తండ్రి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన కుమారుడు షేక్ అప్సర్. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి చెందిన దివంగత షేక్ మజహర్ తండ్రి లేట్ డ్రైవర్ మదర్సాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు షేక్ అప్సర్ ఆధ్వర్యంలో రాపూరు తూర్పు అగర్త కట్ట వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలకు అన్నదానం చేసి వారి ఆకలి తీర్చారు. తండ్రి మరణించినా ఆయన జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటూ, వర్ధంతిని కేవలం స్మరణకే పరిమితం చేయకుండా పేదలకు అన్నం పెట్టడం ద్వారా షేక్ అప్సర్ కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా అందించారు. మరణించిన తమ ఆత్మీయుల జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం సమాజంలో మానవతా విలువలను పెంపొందించడంతో పాటు, ఇతరులకు స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో షేక్ మజహర్ కుమారుడు అప్సర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షేక్ మజహర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...