BREAKING
అభివృద్ధికి నోచుకోని ఆత్మకూరు చేనేత కార్మికులు - మౌళిక వసతులు కరువు బెస్తలకు తీరని ఎస్టీ జాబితా కల - అమలుకు నోచుకోని హామీలు బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మల్లాది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌తో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం అయ్యప్పకు ఘనంగా మండల పూజలు విశేష పడిపూజ కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని

Select Suryaa Now
అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం: పట్టణంలోని ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన, శుద్ధమైన తాగునీటిని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో అందరినీ కలుపుకొని కళ్యాణదుర్గం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. పట్టణంలోని 8, 9వ వార్డుల పరిధిలోని మారెంపల్లి కాలనీలో ఎస్సార్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధజల కేంద్రాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరికీ సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఎస్సార్సీ ట్రస్ట్ ముందుకు వచ్చి మారెంపల్లి కాలనీలో ఉచిత శుద్ధజల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు కూడా ప్రజా సంక్షేమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్ల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రగతిని లక్ష్యంగా చేసుకుని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మారెంపల్లి కాలనీలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, స్థానిక కౌన్సిలర్లు సునీత సంగప్ప, వనం అమృత, ఇతర మున్సిపల్ కౌన్సిలర్లు, ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.