BREAKING
నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మల్లాది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌తో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం అయ్యప్పకు ఘనంగా మండల పూజలు విశేష పడిపూజ కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు విజయలక్ష్మి కనెక్ట్ విత్ జెన్ జీ పొలిటికల్ అకౌంటబిలిటీ-న్యూ ఏజ్ పాలిటిక్స్ విద్యార్థి దశ నుంచే చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

Select Suryaa Now
నామినేషన్లకు పటిష్ట బందోబస్తు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మండపేట రూరల్ సర్కిల్ పరిధిలోని 14 నామినేషన్ కేంద్రాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మండపేట రూరల్ సర్కిల్ సీఐ పీ దొరరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మూడు మండలాల పరిధిలోని 42 గ్రామ పంచాయతీలు, 502 వార్డులు, 189 పోలింగ్ లొకేషన్లకు సంబంధించి పోలీస్ శాఖ భద్రతా చర్యలు చేపట్టింది. నామినేషన్ల స్వీకరణ కోసం మొత్తం 14 కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటి వద్ద 131 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మండపేట మండలంలో ద్వారపూడి, తాపేశ్వరం, వెలగతోడు, ఏడిద గ్రామాల్లో, రాయవరం మండలంలో వెదురుపాక, రాయవరం, చెల్లూరు, వెంటూరు గ్రామాల్లో, కపిలేశ్వరపురం మండలంలో వల్లూరు, అచ్చుతాపురం, అంగర, టేకి, కపిలేశ్వరపురం, కేదారలంక గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ముందస్తు బైండోవర్ చర్యలు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే పోలీస్ శాఖ లక్ష్యమని, ఇందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని సీఐ దొరరాజు కోరారు.