BREAKING
బస్ షెల్టర్లు అవసరాలను పట్టించుకోని పాలకులు - అవస్థల్లో ప్రయాణికులు మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష,కోఆప్షన్ సభ్యుని ఎన్నికలు నేడే నూతన కార్పొరేటర్ షేక్ అబ్దుల్ రసూల్‌కు ఘన సన్మానం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మల్లాది డ్రగ్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌తో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యం అయ్యప్పకు ఘనంగా మండల పూజలు విశేష పడిపూజ కీలక రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వేమిరెడ్డి గారి చొరవ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం.. మానవత్వాన్ని చాటుకున్న కుటుంబ సభ్యులు.... సైదాపురంలో రేపు ఎంపీపీ, ఉప ఎంపీపీ ఎన్నికలు గ్రామాభివృద్ధికి ఆశీర్వదించండి రామలకోటలో సర్పంచ్ అభ్యర్థి ఆచారి సావిత్రమ్మ ఇంటింటి ప్రచారం రైల్వే డబుల్ లైన్ ప్రాజెక్టుల పనులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి* నలుబోతు బ్రహ్మయ్యను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. అందరికీ శుద్ధమైన మంచినీరు అందించడమే నా లక్ష్యం. ఎమ్మెల్యే అమిలినేని సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ముగింపు

విజయలక్ష్మి కనెక్ట్ విత్ జెన్ జీ పొలిటికల్ అకౌంటబిలిటీ-న్యూ ఏజ్ పాలిటిక్స్

Select Suryaa Now
విజయలక్ష్మి కనెక్ట్ విత్ జెన్ జీ  పొలిటికల్ అకౌంటబిలిటీ-న్యూ ఏజ్ పాలిటిక్స్

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    నెల్లూరులోని 21వ డివిజన్ ఆదిత్య కళాశాలలో విద్యార్థులతో “Connect with Gen Z – New Age Politics & Political Accountability” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గునుకుల విజయలక్ష్మి, జనసేన నాయకులు కిషోర్ గునుకుల విద్యార్థులతో ముఖాముఖి ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిత్య కళాశాల యాజమాన్య ప్రతినిధులు వెంకటరెడ్డి, శ్రీనివాసులు, పుల్లయ్య, నరసింహులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నేటి రాజకీయాల్లో యువత పాత్ర, ప్రజాప్రతినిధుల బాధ్యత, యువత రాజకీయ నాయకత్వం నుంచి ఆశిస్తున్న మార్పులు వంటి అంశాలపై చర్చకు వేదిక కల్పించారు.

యువత ప్రశ్నలు.. నాయకుల సమాధానాలు!

ఈ కార్యక్రమంలో విద్యార్థులు రాజకీయాల పట్ల యువత బాధ్యత ఏమిటి? ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంతవరకు జవాబుదారీగా ఉండాలి? రాజకీయాల్లో మహిళలకు సమాన అవకాశాలు ఎలా కల్పించాలి? మహిళల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి పలు కీలక ప్రశ్నలను సంధించారు.  ముఖ్యంగా మహిళల భద్రత, విద్యార్థినుల రక్షణ, కళాశాలల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలు చర్చకు కేంద్రబిందువుగా నిలిచాయి.  విద్యార్థుల ప్రతి ప్రశ్నకు కిషోర్ గునుకుల, కార్పొరేటర్ విజయలక్ష్మి తమ ఆలోచనలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు, క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా సమాధానాలు ఇచ్చారు.

విద్యార్థుల భద్రతే మా బాధ్యత!

ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి మాట్లాడుతూ..

“21వ డివిజన్ పరిధిలోని దాదాపు వెయ్యి మంది విద్యార్థుల భద్రత, సంక్షేమం మా బాధ్యతగా భావిస్తున్నాం. డివిజన్‌లోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, భవిష్యత్తులో జాబ్ మేళాలు, కెరీర్ గైడెన్స్ వంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం” అని తెలిపారు.

యువత రాజకీయాల్లోకి రావాలి!

కిషోర్ గునుకుల మాట్లాడుతూ.. “రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, పదవులు మాత్రమే కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రశ్నించడం, పరిష్కారాల కోసం బాధ్యత తీసుకోవడం. నేటి Gen Z యువత సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా, సమాజ నిర్మాణంలో ప్రత్యక్ష భాగస్వాములు కావాలి. ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు. ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం ప్రజాప్రతినిధుల బాధ్యత” అని పేర్కొన్నారు.  ఈ ప్రత్యేక ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని ముందుండి సమన్వయం చేసిన అభిద్‌కు, కార్యక్రమానికి సహకరించిన ఆదిత్య కళాశాల యాజమాన్యానికి కిషోర్ గునుకుల, విజయలక్ష్మి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

కార్యక్రమ సందేశం  

“యువత కేవలం రేపటి నాయకులు కాదు.. నేటి మార్పుకు కూడా భాగస్వాములు. ప్రశ్నించే తరం ఎదిగితేనే బాధ్యతాయుతమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణమవుతుంది!”  యువత ఆలోచనలకు, ప్రశ్నలకు, అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు మధ్య ప్రత్యక్ష సంభాషణకు మంచి వేదికగా నిలిచింది.