andhrapradesh
గ్రంథాలయం వద్ద హ్యాండ్ రైటింగ్ పోటీలు.
సూర్య న్యూస్ అద్దంకి.
గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా 5వ రోజు బుధవారం అద్దంకి శాఖ నందు బాలికలకు హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. జి ఎస్ ఆర్ హ్యాండ్ రైటింగ్ స్కూల్ నిర్వహకులు జి రమేష్ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో హోమియో వైద్యులు కావూరి రఘు చంద్ మాట్లాడుతూ.... ప్రతిరోజు మీకు ఇష్టమైన పుస్తకం చదవండి లక్షాన్ని చేరుకోండి. సెల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వలన మెదడు మీద, కంటి చూపు మీద ఎక్కువ ప్రభావం పడుతుందని, పుస్తక పఠనంతో ఎలాంటి చెడు ప్రభావానికి లోను కాకుండా జ్ఞానంతో మానసిక ఆనందంతో పాటు , ఆరోగ్యం కూడా పొందవచ్చని రఘుచంద్ అన్నారు. జీ రమేష్ మాట్లాడుతూ.... చిన్నతనం నుంచి చేతి వ్రాతలో ప్రావీణ్యం పొందే అవకాశం తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలని,, బాలబాలికల పట్ల ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా సమాన బాధ్యత తీసుకుంటే వాళ్లు వారి లక్ష్యంతో పాటు మన కలలు కూడా నెరవేరుస్తారని అన్నారు. చేతిరాత పోటీల న్యాయ నిర్నేత గా ఉపాధ్యాయులు కూకట్ల సుబ్బారావు వ్యవహరించి విజేతలైన టీ అవంతిక, కే వైష్ణవి, రక్షిత, పి జయశ్రీ, కే ద్రాక్షాయిని లను ఎంపిక చేశారు. పోటీలో పాల్గొన్న బాలికలు అందరు కూడా పోటాపోటీగా చేతిరాత చక్కగా వ్రాసినందువలన బహుమతులు అందరికీ ఇచ్చేటట్లుగా నిర్ణయించారు. విజేతలకు గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు రోజైన శుక్రవారం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ వారోత్సవాల ప్రోగ్రాం ఆర్గనైజర్ మన్నం త్రిమూర్తులు, లైబ్రరియన్ సిహెచ్ విఎల్ వసుంధర దేవి, డాక్టర్ యు దేవపాలన, బీరం సుందర్రావు , గాడేపల్లి దివాకర్ దత్, తాళ్లూరి బాబురావు, గ్రావిటీ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్ విస్తర్ల వెంకట్రావు, మలాది శ్రీనివాసరావు, నర్రా గోపాలరావు, శశిధర్, గ్రావిటీ స్కూల్ బాలికలు పాల్గొన్నారు.
