BREAKING
కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ

నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్

Select Suryaa Now
నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్

గుంటూరు : గుంటూరు నగరంలో నూతనంగా లే-అవుట్లు ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం ఆదర్శ నగర్, సుబ్బారెడ్డి నగర్ ప్రాంతాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్స్ ని, మానసస రోవరం దగ్గర విండ్రో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుకు పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జిఎంసి పరిధిలో నూతనంగా లే-అవుట్లు నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. అనుమతులు పొందకుండా లే-అవుట్లు వేసి విక్రయాలు జరిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, నగర పరిధిలోని అనధికార లే-అవుట్లను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. లే-అవుట్ నిబంధనల ప్రకారం ప్రజా అవసరాల నిమిత్తం (పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర మౌలిక వసతుల కోసం) నగరపాలక సంస్థకు చెందాల్సిన ఓపెన్ స్పేస్ స్థలాల వివరాలను తక్షణమే ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. నగర పరిధిలో స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసే ముందు సదరు లే-అవుట్‌కు జిఎంసి లేదా సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ నుండి అనుమతి ఉందో లేదో ప్రజలు తప్పనిసరిగా సరిచూసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా వేసే అనధికార లే-అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసి ప్రజలు ఆర్థికంగా నష్టపోవద్దని, భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపా యాల కల్పనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అనంతరం మానససరోవరం పార్క్ దగ్గర విండ్రో కంపోస్ట్ యూనిట్ కి స్థల పరిశీలన చేసి, తగు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబు, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ రమేష్ బాబు, ఎస్ఎస్ సాంబయ్య, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

సూర్య నాయక్