BREAKING
కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ

గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్

Select Suryaa Now
గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్

 గుంటూరు: రాజధాని ప్రాంతంలోని కీలక నగరమైన గుంటూరును ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న బృహత్తర అభివృద్ధి పనులకు పూర్తి స్థాయిలో సహకరించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ప్రపంచ బ్యాంకు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) ప్రతినిధులను కోరారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో ప్రపంచ బ్యాంకు, హడ్కో ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ భేటీలో చర్చించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. ముఖ్యంగా నగరంలో పారిశుధ్య, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు రూ. 300 కోట్ల భారీ వ్యయంతో సీవరేజ్ యుటిలిటీ సదుపాయాల కల్పన, వ్యాపార వర్గాలు మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ. 118 కోట్లతో అత్యాధునిక హంగులతో కూడిన పి.వి.కె. నాయుడు మార్కెట్ నిర్మాణం, అలాగే నగరంలోని తాగునీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవలను సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు రూ. 53.65 కోట్లతో స్కాడా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు. ఇదే సమయంలో గుంటూరు నగరపాలక సంస్థ ఆర్థిక క్రమశిక్షణ, ప్రగతి గురించి ప్రతినిధులకు వివరిస్తూ, జీఎంసీ ఆదాయంలో ప్రతి ఏటా 8 నుండి 15 శాతం వరకు స్థిరమైన వార్షిక వృద్ధి రేటు నమోదవుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆడిట్ ప్రక్రియలు కూడా ఎప్పటికప్పుడు సకాలంలో పూర్తవుతున్నాయని తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన కార్యరూపం దాల్చేందుకు ప్రపంచ బ్యాంకు మరియు హడ్కో సంస్థలు సంపూర్ణ ఆర్థిక, సాంకేతిక సహకారం అందించాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఎస్ఈ జి.వెంకటేశ్వరరావు, ఏఓ జి.తిరుపతి నాయుడు, ప్రపంచ బ్యాంకు, హడ్కో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్