BREAKING
అద్దంకి ఎంపీపీ గా సందెపామ్ జేమ్స్. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేగ జాబ్ మేళా చిట్టమూరు మండల పరిషత్ అధ్యక్షుడిగా తుపాకుల చిన్న శేషయ్య ఏకగ్రీవ ఎన్నిక ఉపాధ్యక్షురాలిగా చింతల సోనియా ఎంపిక కట్కూరు ఎంపీటీసీ సోడే సురేష్ ఎన్నిక చెల్లదని ఆందోళన మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం

ముగిసిన శిక్షణ తరగతులు

Select Suryaa Now
ముగిసిన శిక్షణ తరగతులు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనగణన డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి,  కమిషనర్ వై.ఓ. నందన్ ఆదేశముల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మూడు రోజులపాటు 26 మందికి ఫీల్డ్ ట్రైనర్లకు జనగణన - 2027 శిక్షణా తరగతులను నిర్వహించారు.  శిక్షణ చివరిరోజైన బుధవారం కమిషనర్ హాజరై తరగతుల నిర్వహణను పర్యవేక్షించారు. సెన్సస్ చార్జ్ అధికారి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణలో మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ మాల్యాద్రి , కోటేశ్వరరావు శిక్షణ అందించారు.   ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెన్సస్ 2027 కు సంబంధించి విడుదల చేసిన కీలక తేదీల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 2027 జనవరి 10 నుంచి 24 వరకు, ఇంటింటి జనాభా గణన జనవరి 25 నుంచి ఫిబ్రవరి 28 వరకు, సవరణాత్మక దశ మార్చి 1 నుంచి 5 వ తేదీ వరకు నిర్దేశించారని తెలిపారు.   పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందించిన శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు తమ పరిధిలోని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. స్వీయ నమోదుకు సంబంధించి ప్రజలంతా అవగాహన పొంది స్వయంగా జనగణనలో భాగస్వాములు కావాలని, జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన ఇంచార్జి యం. రాజమోహన్ రెడ్డి, అదనపు జిల్లా ఇంచార్జి ఆధ్విక పాల్గొన్నారు.