కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర పాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగంలో మేస్త్రీ, వర్కర్లుగా విధులు నిర్వహిస్తూ మరణించిన ఆర్. వేణు గోపాల్ రావు, ఆర్. వెంకటేశ్వర్లు ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా కారుణ్య నియామకం ద్వారా వారి వారసులు ఆర్. సాయి సందీప్, ఆర్. మధు బాబు లకు అటెండర్ లుగా విధులను కేటాయిస్తూ కమిషనర్ వై.ఓ నందన్ ఉత్తర్వులను జారీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయం కమిషనర్ ఛాంబర్ లో బుధవారం కారుణ్య నియామకం పత్రాలను వారు కమిషనర్ నుంచి అందుకున్నారు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కమిషనర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ నరేంద్ర ఉన్నారు.