ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా
గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ శుక్ర, శనివారాల్లో (20,21 తేదీల్లో) ప్రత్యేక ‘ఎల్ఆర్ఎస్ మేళా’ నిర్వహిస్తున్నట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దరఖాస్తుదారుల సౌకర్యార్థం గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్లో, బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఈ ప్రత్యేక మేళా కొనసాగుతుందన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ఇంకా సంబంధిత ఫీజు చెల్లించాల్సి ఉన్నవారు, అలాగే దరఖాస్తుల పరిశీలనలో భాగంగా షార్ట్ ఫాల్ ఎండార్స్‌మెంట్లు జారీ చేయబడి అవసరమైన పత్రాలు సమర్పించా ల్సి ఉన్నవారు ఈ మేళాకు హాజరై తమ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసుకోవచ్చని వివరించారు. ఈ మేళాలో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేస్తూ అక్కడికక్కడే దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. కావున, పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేసుకోవడానికి లభించిన ఈ సదావకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని, సంబంధిత పత్రాలు మరియు రసీదులతో హాజరై తమ దరఖాస్తులను పూర్తి చేసుకోవాలని కోరారు.
సూర్య నాయక్