BREAKING
కావలి, అల్లూరులో వైసీపీ జెండా ఎగరాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి.. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. •జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కారుణ్య నియామకంలో అటెండర్ లుగా విధుల కేటాయింపు ఆర్ఎన్ఆర్ క్వింటా రూ.4,051 , కరువు మండలాలుగా ప్రకటించాలి.. టీడీపీ బీసీ సెల్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని ముగిసిన శిక్షణ తరగతులు చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Select Suryaa Now
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

సూర్య ..రాజన్న సిరిసిల్ల లో
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా సమీకృత కార్యాలయ ఆడిటోరియంలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పంచాయతీ అధికారులు, వార్డు ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులకు ప్రొజెక్టర్ ద్వారా శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో విడతల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలు తీసుకుంటారని చెప్పారు. రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేక దరఖాస్తులో తీసుకుంటారని పేర్కొన్నారు.బీమా చేయించేవారు నామినీ వివరాలు స్పష్టంగా తెలియజేయాలని, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది నామినీలు ఉండవచ్చని సూచించారు. జిల్లాలోని ప్రతి కుటుంబానికి ఈ సమాచారం చేరవేయాలని ఆదేశించారు.శిబిరాల వద్ద టెంట్లు, కుర్చీలు, ప్లెక్సీలు, తాగునీరు, కంప్యూటర్లు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీఓ వీర భద్రయ్య, జిల్లా ప్రణాళిక అధికారి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్, ఈడీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.