BREAKING
ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ కౌమార బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఆలయంలో నాగమల్లి మొక్క నాటిన మాజీ సర్పంచ్ చిందం రమేష్ 'భారత్ 2047' థీమ్‌తో ఫికీ వార్షిక సదస్సు వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ‘వ్యూ’ మూవీ.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక, నవంబర్ 20న థియేటర్లలో విడుదల పెద్దమ్మ తల్లి పంచరాత్రోత్సవాలకు గవర్నర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆహ్వానం బాల్య వివాహాల నివారణ అందరి ఉమ్మడి బాధ్యత: డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ వర్సిటీల కేంద్రంగా సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటుకు మన్‌సుఖ్ మాండవ్య పిలుపు

రామేశ్వర్ పల్లి గ్రామంలో చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీ

Select Suryaa Now
రామేశ్వర్ పల్లి గ్రామంలో చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీ

సూర్య- బిక్కనూర్ : మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో బుధవారం  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చేయూత ఆసరా పెన్షన్ల పత్రాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, చేనేత,గీత కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఆసరా పెన్షన్లకు పంపిణీ చేస్తుందన్నారు. సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో చేయూత ఆసరా పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పీఏసీఎస్ చైర్మన్ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,,ఎంపీడీవో సవితా రెడ్డి,మాజీ డీసీసీబీ చైర్మన్ ఎడ్ల రాజారెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉప సర్పంచ్  గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగర్తి రమేష్ రెడ్డి,వార్డు సభ్యులు లావణ్య లక్ష్మారెడ్డి, భవాని ధర్మస్వామి, పనాస రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్యామ్, లబ్ధిదారులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.