పెద్దమ్మ తల్లి పంచరాత్రోత్సవాలకు గవర్నర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆహ్వానం
వికారాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఈ నెల 29వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ పంచరాత్రోత్సవ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య కూడా గవర్నర్‌ను ఆహ్వానించారు.డిసెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న ఉత్సవ కార్యక్రమానికి గవర్నర్ హాజరుకానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరోత్తమ్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ స్పెషల్ సీఎస్ దాన కిషోర్ కూడా ఈ సందర్భంగా ఉన్నారు.