BREAKING
ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ కౌమార బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఆలయంలో నాగమల్లి మొక్క నాటిన మాజీ సర్పంచ్ చిందం రమేష్ 'భారత్ 2047' థీమ్‌తో ఫికీ వార్షిక సదస్సు వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ‘వ్యూ’ మూవీ.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక, నవంబర్ 20న థియేటర్లలో విడుదల పెద్దమ్మ తల్లి పంచరాత్రోత్సవాలకు గవర్నర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆహ్వానం బాల్య వివాహాల నివారణ అందరి ఉమ్మడి బాధ్యత: డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ వర్సిటీల కేంద్రంగా సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటుకు మన్‌సుఖ్ మాండవ్య పిలుపు

ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఆలయంలో నాగమల్లి మొక్క నాటిన మాజీ సర్పంచ్ చిందం రమేష్

Select Suryaa Now
ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఆలయంలో నాగమల్లి మొక్క నాటిన మాజీ సర్పంచ్ చిందం రమేష్

సూర్య బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హరిత సంకల్పం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అధినేత జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ప్రతి ఇంట ఉసిరి - ప్రతి గుడిలో బిల్వం కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణంలో మాజీ సర్పంచ్ చిందం రమేష్ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నాగమల్లి మొక్కను నాటారు.ఈ సందర్భంగా చిందం రమేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా సంతోష్ కుమార్ చేపట్టిన హరిత సంకల్పం ఎంతో అభినందనీయమన్నారు. ప్రతి గ్రామంలోని ఆలయాల్లో ఏకబిల్వం మొక్కలు నాటుతూ, ప్రతి ఇంట ఉసిరి - ప్రతి గుడిలో బిల్వం అనే నినాదంతో ప్రజలను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బుర్ర రాజు, అర్చకులు అనిల్ కుమార్, గుడి మల్లారెడ్డి, ఏడపెల్లి లచ్చయ్య, శీలం శ్రీను, మూదం కమలాకర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యుడు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.