BREAKING
ఈనెల 20, 21వ తేదీల్లో జిఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళా నూతన లే-అవుట్లకు అనుమతులు తీసుకోవాలి: కమిషనర్ కె.మయూర్ అశోక్ కిమ్స్‌ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పకడ్బందీ ఏర్పాట్లు.. ప్రతి కుటుంబానికి సమాచారం చేరాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి: శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి గుంటూరు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహకరించాలి: కమిషనర్ దేశవ్యాప్తంగా ఘనంగా 9వ జాతీయ ప్రకృతి చికిత్స దినోత్సవం బ్రిటన్‌లో నష్టాల్లో ముగిసిన ఎఫ్‌టీఎస్‌ఈ 100 సూచీ కౌమార బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ప్రతి ఇంట ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం.. తడగొండ ఆలయంలో నాగమల్లి మొక్క నాటిన మాజీ సర్పంచ్ చిందం రమేష్ 'భారత్ 2047' థీమ్‌తో ఫికీ వార్షిక సదస్సు వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ‘వ్యూ’ మూవీ.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక, నవంబర్ 20న థియేటర్లలో విడుదల పెద్దమ్మ తల్లి పంచరాత్రోత్సవాలకు గవర్నర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆహ్వానం బాల్య వివాహాల నివారణ అందరి ఉమ్మడి బాధ్యత: డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ వర్సిటీల కేంద్రంగా సమగ్ర క్రీడా వ్యవస్థ ఏర్పాటుకు మన్‌సుఖ్ మాండవ్య పిలుపు

కౌమార బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

Select Suryaa Now
కౌమార బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

గుంటూరు:  కౌమార దశ బాలికల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ  అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ, విద్యా శాఖ, ప్రణాళిక శాఖ అధికారులతో కౌమార దశ బాలికల ఆరోగ్యం ముఖ్యంగా కౌమార దశ బాలికలలో గర్భధారణ అంశంపై బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షించారు.  జిల్లాలో 12 నుండి 20 సంవత్సరాల లోపు బాలికల వివరాలు సేకరించాలని అన్నారు. వారిలో ఏ ఒక్కరూ డ్రాప్ ఔట్ కాకుండా నిశితంగా పర్యవేక్షణ చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. డ్రాప్ ఔట్ లు ఉంటే అందుకు గల కారణాలు తెలుసుకొని విద్యార్ధిని ఇంటికి వెళ్ళి కౌన్సెలింగ్  ఇచ్చి, పాఠశాల లేదా కళాశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలకు గురైన బాలికలకు ఒక ప్రశ్నావళిని రూపొందించి, బాల్య వివాహం  చేసుకొనుటకు కారణాలు, వివాహం అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ప్రశ్నావళి రూపంలో తీసుకుని విశ్లేషణ చేయాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారిని ఆదేశించారు. గ్రామాల్లో జరిగే వివాహాన్ని సంబంధిత గ్రామ/ వార్డు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మహిళా సంరక్షణా కార్యదర్శి, పంచాయతీ సెక్రెటరీకి సమాచారం అందించాలని,  బాల్య వివాహము కాదని ధృవీకరించిన తదుపరి వివాహం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివాహం జరిపించు మత పెద్దలకు, కళ్యాణ మండపం, ఫంక్షన్ హాలు యాజమాన్యా నికి, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు బాల్య వివాహాలు -  బాల్య వివాహ నిషేధిత చట్టములో  పొందుపరచిన శిక్షలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి పాఠశాలలో ఒక కమిటీని ఏర్పాటు చేసి విద్యార్ధులకు బాల్య వివాహం చేసుకొనుట వలన కలుగు అనర్ధాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 10వ తరగతి చదువుతున్న ప్రతి విధ్యార్ధిని  ఉత్తీర్ణురాలు అయ్యే విధంగా తర్ఫీదు ఇవ్వడం, ఉత్తీర్ణత పొందిన అనంతరం తదుపరి కోర్సులలో చేరే విధంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. బాల్య వివాహాలు జరుగకుండా, కౌమార బాలికలలో గర్భధారణ లేకుండా స్పష్టమైన కార్యాచరణ ఉండాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్, రెవెన్యూ అధికారుల బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సామాజిక రుగ్మతగా ఉన్న అంశంను రూపాపాలని, వారి ఆరోగ్యం కాపాడాలని అన్నారు. కౌమార దశ బాలికల ఆరోగ్యం ఆవశ్యమని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.జి.ప్రసూన, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత, డిగ్రీ కళాశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఇళ్లా రవి తదితరులు పాల్గొన్నారు.

 

సూర్య నాయక్