BREAKING
మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ

కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలు వేలం, కర్ణాటక మద్యం నాటుసార ధ్వంసం.

Select Suryaa Now
కళ్యాణదుర్గం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాలు వేలం, కర్ణాటక మద్యం నాటుసార ధ్వంసం.

కళ్యాణదుర్గం: అక్రమ మద్యం విక్రయాలు, రవాణాపై చర్యల్లో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు నాలుగు వాహనాలను వేలం వేసి, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం, నాటుసారాను ధ్వంసం చేశారు. అనంతపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. రామ్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణదుర్గం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన నాలుగు వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ.52,000 కాగా, వేలంపాటలో రూ.53,300 ధర పలికింది. దీనికి రూ.9,594 జీఎస్టీ కలిపి మొత్తం రూ.62,894 ప్రభుత్వానికి ఆదాయంగా సమకూరింది. అదేవిధంగా వివిధ ఎక్సైజ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 75.69 లీటర్ల కర్ణాటక మద్యం, ఐదు కేసుల్లో పట్టుబడిన 7.56 లీటర్ల ఆంధ్ర మద్యం, మరో ఐదు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 48.52 లీటర్ల నాటుసారాను అధికారులు నిబంధనల ప్రకారం ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జయనాథ్ రెడ్డి, కళ్యాణదుర్గం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ డి. సోమశేఖర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. పోలక్క, హెడ్ కానిస్టేబుల్ ఇమ్రాన్, కానిస్టేబుళ్లు నరసరాజు, ప్రతాప్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.