ప్రముఖ గాయిని భూదేవి తల్లికి దక్కిన గొప్ప గౌరవం : ఊటుకూరు లక్ష్మమ్మకు విశిష్ట మాతృమూర్తి పురస్కారం
మదనపల్లి రూరల్,మేజర్ న్యూస్ : శాంత బయోటెక్ అధినేత,పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వారి తల్లి కోడూరు శాంతమ్మ జ్ఞాపకార్థం మాతృవందనం కార్యక్రమంలో భాగంగా విశిష్ట మాతృమూర్తి పురస్కారం సత్కరించడం ఆనవాయితీ.ఈ ఏడాది అన్నమయ్య జిల్లా,మదనపల్లికి చెందిన ప్రముఖ గాయిని ఊటుకూరు భూదేవి తల్లి ఊటుకూరు లక్ష్మమ్మని కొడూరు శాంతమ్మ (మాతృవందనం) విశిష్ట మాతృమూర్తి పురస్కారానికి ఎంపిక చేశారు.తెలుగు రాష్ట్రాలలో గాయినిగా భూదేవి సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకొని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.ఊటుకూరు లక్ష్మమ్మకు ప్రముఖ సిద్ధాంతి చాగంటి సోమయాజులు కొండూరు శాంతమ్మ (మాతృవందనం) విశిష్ట మాతృమూర్తి పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ సందర్భంగా భూదేవి మాట్లాడుతూ సృష్టిలో అమ్మఅనే పదం ఎంతో మధురమైందన్నారు.నాకు మా అమ్మ అంటే ఎంతో ఇష్టమని,ఆమెకి ఈ పురస్కారం లభించడం గర్వంగా ఉందన్నారు.ఈ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఆనందం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో మధురగానంతో ప్రేక్షకులు హృదయాలను గెలుచుకోవడమే తన సంకల్పమన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి