BREAKING
మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ

చింతకుంటలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  పర్యటన - ఆగిపోయిన "విఓ" భవనానికి మోక్షం

Select Suryaa Now
చింతకుంటలో సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  పర్యటన - ఆగిపోయిన "విఓ" భవనానికి మోక్షం

సూర్య,సిర్పూర్ (టి):- సిర్పూర్ (టి) మండలం చింతకుంట గ్రామంలో  భూ వివాదంతో ఆగిపోయిన మహిళా సమైక్య (వి ఓ) భవన నిర్మాణానికి చివరకు మోక్షం లభించింది. సబ్ కలెక్టర్ హర్ష చౌదరి  స్వయంగా గ్రామానికి విచ్చేసి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.తహసీల్దార్ రహీముద్దీన్ , సర్పంచ్ అజ్మేర చత్రు నాయక్  కలిసి భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్, నిర్మాణం ఎందుకు ఆగిపోయిందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ భూమిని సర్వే చేయించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించి, భవన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని తహసీల్దార్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ చత్రు నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నా, క్షేత్రస్థాయిలో భూ సమస్యల వల్లనే చాలా చోట్ల భవనాలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చింతకుంటలోని 4 అంగన్వాడీ సెంటర్లకు, గ్రామానికి కావాల్సిన ఇతర భవనాలకు కూడా వెంటనే స్థలం కేటాయించాలని సబ్ కలెక్టర్ గారిని కోరారు.
దీనికి స్పందించిన సబ్ కలెక్టర్ , గ్రామాభివృద్ధికి కావాల్సిన భవనాలకు భూ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో గ్రామ మహిళలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాజిరెడ్డి మోహన్, వార్డు సభ్యులు బొట్లకుంట శ్రీనివాస్, పబ్బతి శేఖర్, మొగిలి రాజేష్, బానోత్ వినోద్, అజ్మీరా మోహన్, భూక్య విగ్నేష్, చిపల్లి రమేష్, కాటేబోయిన పోశయ్య, పెంటపర్తి రాజ్ కుమార్, విఓ అధ్యక్షురాలు కన్నెపల్లి కమల, లావుడే విజయ, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.