BREAKING
నేడు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్షా దివస్.. నాలుగు నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కలగొట్ల అభివృద్ధికి కృషి చేస్తా ● మంచం గుర్తుపై ఓటేసి గెలిపించండి ● సర్పంచ్ అభ్యర్థి చిట్రెడ్డి విమల సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం

సింగరేణిలో డిజిఎం బి.వి సేవలు మరువలేనివి

Select Suryaa Now
సింగరేణిలో డిజిఎం బి.వి సేవలు మరువలేనివి

సూర్య, సెంటినరీ కాలనీ ;సింగరేణి సంస్థలో డిజిఎం బి.వి.సత్యనారాయణ సేవలు మరువలేనివని ఆర్జీ-2 జీఎం తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ అన్నారు. సింగరేణి సంస్థ ఆర్జీ-2 ఏరియాలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న డిజిఎం బి.వి.సత్యనారాయణ  ఒరిస్సాలోని నైనీ ప్రాజెక్ట్ కు  బదిలీ పై  వెళ్తున్న సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ తాళ్ళపల్లి లక్ష్మీపతి గౌడ్ ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ సత్యనారాయణ ఆర్.జి-2 ఏరియాలో సేఫ్టీ విభాగంలో అందించిన సేవలు మరువలేనివని, కార్మికుల భద్రత విషయంలో ఆయన తీసుకున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. నైనీ ప్రాజెక్ట్ లో కూడా ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం బదిలీపై వెళ్తున్న డిజిఎం బి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్జీ-2 ఏరియాలో పనిచేసిన కాలంలో ఏరియా జనరల్ మేనేజర్ తో పాటు అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు అందించిన సహాయ సహకారాలను మరువలేనని అన్నారు. సింగరేణి సంస్థ తనకు ఎంతో నేర్పిందని, ఇక్కడ పొందిన అనుభవాలను నైనీ ప్రాజెక్ట్ లో కూడా కొనసాగిస్తానని తెలిపారు. తనకు ఈ సన్మానం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఒటు జిఎం మాలోత్ రాముడు, ఐఈడీ ఎజిఎం  చంద్రశేఖర్, ఏరియా ఇంజనీర్ ఎం.వి.ఎన్.చంద్రశేఖర్, డిజిఎం (ఎఫ్ &ఎ) వెంకట్ రాంచంద్ర, పర్చెస్ డిజిఎం వెంకటేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉదయ్ హరిజన్, క్వాలిటీ మేనేజర్ సుభాష్ , పర్సనల్  హెచ్ ఒడి  ఎన్.వేణుగోపాల్,సుభాష్, ఎస్టేట్ ఆఫీసర్ సునీత, ఐటీ మేనేజర్ అశ్విని,మొదలగు కార్యాలయ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.