డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక
వికారాబాద్,మేజర్ న్యూస్: వికారాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా డిసెంబర్ 1న వికారాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్ రాక నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు, సంబంధిత అధికారులు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. గవర్నర్ పర్యటనతో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.