కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత
బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్: బొంరాస్‌పేట్ మండల కేంద్రానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య అనసూయ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అనసూయ మృతి పట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింలు గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్ చంద్రారెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని పేర్కొన్నారు. వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, ఆయా మండలాల అధ్యక్షులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించాలని కోరారు.