BREAKING
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం

భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు..

Select Suryaa Now
భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు..

- తిరుప్పరంకుండ్రం దీప ప్రజ్వలనపై హర్షం 
- పాదగయ పుణ్యక్షేత్రంలో వెలిగిన ధర్మజ్యోతి
- సనాతన సంప్రదాయాల పరిరక్షణే మా సంకల్పం: వెంకటేశ్వరరావు

ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య బ్యూరో :

పిఠాపురంలోని పాదగయ పుణ్యక్షేత్రంలో శనివారం విశ్వహైందవ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మజ్యోతిని వెలిగించారు. తమిళనాడులోని మదురై సమీపంలో తిరుప్పరంకుండ్రం కొండపై దీప ప్రజ్వలన జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరుప్పరంకుండ్రంలో దీపం వెలిగించడం హిందువుల ధార్మిక విశ్వాసాలకు, ఆచార సంప్రదాయాలకు లభించిన గౌరవంగా అభివర్ణించారు.

ఎవరికీ వ్యతిరేకం కాదు..!

రాజ్యాంగ పరిధిలో తమ మత విశ్వాసాలను, సంప్రదాయాలను ఆచరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆలయాల పవిత్రతను, ధార్మిక సంప్రదాయాలను గౌరవించడం అందరి బాధ్యతన్నారు. ధర్మజ్యోతి ప్రజ్వలన ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమం కాదని, హిందూ సమాజంలో ధార్మిక చైతన్యం, ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. ధర్మాన్ని అణచివేయలేరని, భక్తి జ్యోతిని ఆర్పలేరని, సనాతన సంప్రదాయాల పరిరక్షణే తమ సంకల్పమని అన్నారు.

కార్యక్రమంలో విశ్వహైందవపరిషత్ నాయకులు కొండేపూడి శివనారాయణ, సోనాబాబు, సికోలు రాజశేఖర్, శ్రీనివాస్, రమణబాబు, నితిన్ శ్రీ, బాబీ, ప్రసాద్, కొండరాజులు, రమణ, ధీరేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.