BREAKING
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

Select Suryaa Now
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

రంపచోడవరం, సూర్య ప్రతినిధి : 
పోలవరం జిల్లాలో రెండవ విడత, తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన ఆయా మండలాలకు చేరుకుని, అక్కడి నుంచి పోలింగ్ సామగ్రిని స్వీకరించి తమకు నిర్దేశించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు.నేడు నిర్వహించనున్న రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 7 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. చింతూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని వి.ఆర్.పురం, చింతూరు, కూనవరం, యటపాక మండలాలతో పాటు రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి, వై.రామవరం, గూర్తేడు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.సర్పంచ్ స్థానాలకు సంబంధించి 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం.రెండవ విడతలో మొత్తం 95 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. వెంకటరెడ్డిపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 90 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ సర్పంచ్ స్థానాలకు మొత్తం 281 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.122 వార్డులు ఏకగ్రీవం.. 757 వార్డులకు పోలింగ్.అదేవిధంగా జిల్లాలో మొత్తం 884 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టగా, 122 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరో 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 757 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 1,725 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.మారేడుమిల్లి మండలంలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీలో 3, 5వ వార్డులకు, వెంకటరెడ్డిపేట గ్రామ పంచాయతీలో 3, 4, 5వ వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల అధికారులు వెల్లడించారు.ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ కోరారు.