BREAKING
భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ

మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం

Select Suryaa Now
మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం

- కాజులూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల అభినందనలు

కాజులూరు, మేజర్ న్యూస్ : రామచంద్రపురం మున్సిపల్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మేడిశెట్టి శేషారావుకు మోడరన్ ఫౌండేషన్ తరఫున ‘ప్రజామిత్ర’ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాజులూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శేషారావుకు అభినందనలు తెలిపారు. శనివారం స్థానిక మోడరన్ విద్యాసంస్థల ప్రాంగణంలో సంస్థ అధినేత లయన్ జి.వి.రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గతంలో మోడరన్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసిన శేషారావు నేడు మున్సిపల్ చైర్మన్ స్థాయికి ఎదగడం గర్వకారణమని జి.వి.రావు కొనియాడారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల కోసం మోడరన్ విద్యాసంస్థలు రూపొందించిన ‘బిట్ బ్యాంక్’ను శేషారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ తన ప్రస్థానం మోడరన్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా ప్రారంభమైందని, ఇక్కడ అలవడిన క్రమశిక్షణే తనను ఈ స్థాయికి చేర్చిందని గుర్తుచేసుకున్నారు. తాను పనిచేసిన సంస్థ నుంచే పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని, పట్టణ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ సీహెచ్ రాజేష్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం.చిట్టిబాబు, అకాడమిక్ డైరెక్టర్లు కె.సాయిరాం చౌదరి, ఎ.రమాదేవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.