BREAKING
సమసమాజ స్థాపన కోసం పోరాడిన వ్యక్తి పూలే భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి

Select Suryaa Now
పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి

- రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎటు వంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలి.

- పోలింగ్,ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అధికారులకు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశాలు

గొల్లప్రోలు, మేజర్ న్యూస్ :

గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియల ను రాష్ట్ర ఎన్నికల సం ఘం నిబంధనలకు అనుగుణం గా పూర్తి పారదర్శకతతో, నిష్పక్ష పాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
శనివారం గొల్లప్రోలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తున్న ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, సిబ్బంది విధులు, పోలింగ్ సామగ్రి పంపిణీ తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పోలింగ్ సామగ్రిని చెక్‌లిస్ట్ ప్రకారం స్వీకరించి, అందులోని ప్రతి వస్తువును సరిచూ సుకోవాలని సూచించా రు. పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వెంటనే రహస్య ఓటింగ్ కంపార్ట్‌మెంట్, సిబ్బంది కూర్చునే ఏర్పాట్లు తదితర అంశాలను సిద్ధం చేసుకోవాలన్నారు.పోలింగ్ కేంద్రం వెలుపల పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులతో కూడిన నోటీసు బోర్డులను నిబంధన ల ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదే శించారు.
రెండో విడత ఎన్నికలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పోలింగ్ ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ నిర్వహణ లో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహ రిస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితం గా పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్ల లెక్కింపు చేపట్టాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలను సర్పంచ్,వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి వేర్వేరుగా విభజించిన తర్వాత నిబంధనల ప్రకారం లెక్కింపు ప్రారం భించాలన్నారు. ప్రతి రౌండ్‌లో లెక్కించిన ఓట్ల వివరాలను ఎప్పటిక ప్పుడు కంప్యూటరీకరించి నమోదు చేయడం ద్వారా ఫలితాల క్రోడీకరణ వేగవంతంగా, పారదర్శకంగా జరుగు తుందని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి దశ లోనూ సిబ్బంది తమ విధులు,బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిం చాలని, బ్యాలెట్ పత్రాల విభజన, ఓట్ల లెక్కింపు, ఫలితాల నమోదు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత సమయంలో కౌంటింగ్ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను ప్రశాంత వాతావరణంలో, ఎటు వంటి పొరపాట్లకు తావు లేకుండా, పూర్తి పారదర్శ కతతో, నిష్పక్ష పాతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
పర్యటనలో మెప్మా పీడీ మరియు గొల్లప్రోలు మండల రిటర్నింగ్ అధికారి పి. శైలజ మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.