BREAKING
భక్తి జ్యోతిని ఆర్పలేరు!...ధర్మాన్ని అణచలేరు.. భూమా అఖిలప్రియా దాష్టికానికి మహిళ మృతి రెండు బొలెరో వాహనాలు ఢీ నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ

బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి

Select Suryaa Now
బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి

- మహాత్మా జ్యోతిరావు ఫూలే 136 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో నివాళి

కాకినాడ, మేజర్ న్యూస్ : బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు కొనియాడారు.
జ్యోతిరావు ఫూలే 136 వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఉదయం కాకినాడ పాత బస్టాండ్ సెంటర్ లో గల ఫూలే విగ్రహానికి కరణం ప్రసాదరావు పూలమాల వేసి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 ఏళ్ళ క్రితం భారత సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతలపై అలుపెరుగని పోరాటం చేసిన ధీరుడు ఫూలే అని పేర్కొన్నారు. ఆనాడు అట్టడుగు వర్గాల పిల్లలతో పాటు, ఆధిపత్య కులాల మహిళలు కూడా చదువుకు నోచుకోలేదన్నారు. విద్య ఆవశ్యకత గుర్తించి, భార్యకు చదువు చెప్పి, బాలికా విద్య కోసం పాఠశాల ప్రారంభించిన ఫూలే ధన్యజీవి అని కొనియాడారు.
సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ మన దేశంలో రాజా రామ్మోహన్ రాయ్ తో సంఘ సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. బాలికా విద్య, వితంతు పునః వివాహాలు జరిపించడానికి కృషి చేశారన్నారు. అంటరానితనం,కుల వివక్షతలపై  అలుపెరుగని పోరాటం చేశారన్నారు. ఫూలే స్ఫూర్తితో సమాజంలో నేటికీ కొనసాగుతున్న కుల వివక్ష, అసమానతలపై పోరాడాలని సిపిఎం పిలుపు ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, నగర కమిటీ సభ్యుడు నాగాబత్తుల సూర్యనారాయణ తో పాటు ఎం. సూరిబాబు, డి. ఆదర్శ్, లోవరాజు, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.