పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్
- నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి.
- జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
పిఠాపురం, మేజర్ న్యూస్ :
పిఠాపురం నందు నిర్మాణంలో ఉన్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ శనివారం స్థానిక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మరియు పారి శ్రామిక అవసరాల నిమిత్తం కల్పించనున్న మౌలిక సదుపాయాల వివరాలను సంబంధిత ఇంజినీరింగ్, పారిశ్రామిక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం ఎస్ ఎం ఈ) స్థాపనకు అనువైన వాతావరణం, వసతులు కల్పించడం ద్వారా స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లు ఎంతగానో దోహద పడతాయని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం వల్ల ఔత్సాహిక పారిశ్రా మికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు ఒకే చోట లభించడంతో పాటుగా స్థానిక యువత కు విస్తృతంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడ తాయని ఆయన స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను తప్పని సరిగా పాటించాలని, నిర్ణీత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముం దుకు సాగాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ముఖ్యంగా విద్యుత్, నిరంతర నీటి సరఫరా, అంతర్గత రహదారులు, డ్రైనేజీ మరియు పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపా యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనుల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక లేదా ఇతర సమస్యలను తక్షణమే గుర్తించి, సంబం ధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. పిఠాపురం ప్రాంత పారిశ్రామిక ప్రగతి కి ఈ ప్రాజెక్టు కీలకం కానున్న నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేసి, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులను ముందుగానే సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా లభించే వ్యవసాయ, ఆక్వా రంగ ఉత్పత్తులను విలువ ఆధారిత వస్తు వులుగా మార్చేందుకు ఈ ప్లాటిడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎంతగానో ఉపయోగపడ తాయని అదేవిధంగా స్థానికంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పనతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు లభిస్తాయ న్నారు. అనంతరం, టిడ్కో (టిడ్కో) గృహ సముదాయం వద్ద మహిళల జీవనోపాధుల పెంపుదల కొరకు చేపట్టిన నూతన శిక్షణ భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ భవన నిర్మాణం పూర్త యిన వెంటనే మహి ళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను ప్రారం భించి, మహిళా అభ్యుదయానికి మరియు ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో పిఠా పురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పథక సంచాలకులు పి. శివరాం ప్రసాద్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కె. రాజేశ్వరరావు, ఏపీఐఐసీ ఇంజి నీర్లు, టిడ్కో ఇంజినీర్లు మరియు ఇతర సంబం ధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.